ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ
46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, 10 మార్చి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల కింద నష్ట పరిహారం పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో నమోదైన ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల ఆధారంగా మొత్తం 46 మందికి రూ.36,87,500 పరిహారం 
వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం ముస్తాబాద్ మండలంలో 3, కోనరావుపేట మండలంలో 6, వేములవాడ అర్బన్, రూరల్ మండలంలో 12, సిరిసిల్ల మండలంలో 5, చందుర్తి మండలంలో 3, బోయినపల్లి మండలంలో 4, తంగళ్లపల్లి మండలంలో 5, గంభీరావుపేట మండలంలో 2, ఎల్లారెడ్డిపేట మండలంలో 2, ఇల్లంతకుంట మండలంలో 3, జగిత్యాల జిల్లాలో ఒకరికి పరిహారం పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఈ ప్రకటనలో వివరించారు.

Post a Comment

Previous Post Next Post