శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించండి
జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే
సిరిసిల్ల, 10 మార్చ్: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గితే. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే ను పాత్రికేయులు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా ఉన్న పాత్రికేయులు తమ బాధ్యతను గుర్తెరిగి సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకారించాలని కోరారు. ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా పాత్రికేయులకు ఎస్పీ సూచించారు. సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు జాన దయానంద్, నాయిని బాబు, మాజీ అధ్యక్షులు మిట్టపల్లి కాశీనాథ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Rajanna Sircilla