భారతి విద్యా నిలయం పాఠశాలలో సైన్స్ డే ప్రదర్శనలు

భారతి విద్యా నిలయం పాఠశాలలో సైన్స్ డే ప్రదర్శనలు
రాజన్న సిరిసిల్ల, 28 ఫిబ్రవరి (జనవిసన్ న్యూస్): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ లో గల భారతి విద్యా నిలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థులు సైన్స్ లో తాము నేర్చుకున్న అంశాలతో కూడిన ప్రాక్టీస్ చేస్తూ వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి మురికి నీటిని నీటిని సాధారణ నీటిగా మార్చే పద్ధతి, హైడ్రాలిక్ బ్రిడ్జ్, విద్యుత్ వాడకం అవసరం లేని వాషింగ్ మిషన్, అగ్నిపర్వతాల లావాను పరీక్షించడం, వర్షపు రాకడను ముందుగా గుర్తించే యంత్రం పనితీరు, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం) యంత్రం పనితీరు, గడ్డి కోసే యంత్రం, రాత్రి, పగలు సమయం పరిశీలన వంటి పలు ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ రాంరెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణకర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బాలకృష్ణ, పద్మావతి, రాజు, సుష్మ, స్వప్న, మాధవి, హిమజ, అంజలి, అరుణ, దుర్గ భవాని, అర్చన తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post