రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక


రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక


రుద్రంగి, జనవరి 3 (జనవిజన్ న్యూస్): జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరిని సమన్వయం చేస్తూ ప్రెస్ క్లబ్ అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నంద్యాడపు అంజయ్య. శుక్రవారం రుద్రంగి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నంద్యాడపు అంజయ్య, ఉపాధ్యక్షుడిగా పోగుల మోహన్, ప్రధాన కార్యదర్శిగా కూర్మాచలం సత్యనారాయణ, కోశాధికారిగా ఆకుల గంగాధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతకు కృతజ్ఞతలు తెలుపుతూ, సభ్యులందరి సహకారంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో TUWJ IJU తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) జిల్లా సంయుక్త కార్యదర్శి ఎలిగేటి సూర్యకిరణ్, దేశవేణి ధర్మేష్, బింగిశెట్టి వెంకటేష్, ఎలిగేటి సూర్యకిరణ్, సుగిగెపు పరుశురాం, ఎలిగేటి ప్రదీప్, తుమ్మనపల్లి శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post