రాజన్నసిరిసిల్ల ప్రతినిధి (జనవిజన్ న్యూస్): పోలీస్ కమ్యూనిటీలో భాగంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ ను చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక వ్యాయమంగా ఉపయోగపడతాయని అన్నారు. స్నేహపూర్వక వాతావరణం లో క్రీడలు జరుపుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ టోర్నమెంట్ రెండు రోజులపాటు జరుపనున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్, నాయకులు తర్రె మనోహర్, ఎర్రం గంగ నర్సయ్య, నంద్యాడపు వెంకటేష్, పిల్లమరపు ప్రవీణ్, పులి రాజేష్, బాసని రాజు తదితరులు పాల్గొన్నారు .
మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు
byJanavisiontv
-
0