ఎయిర్ పోర్టులో ఇంత తక్కువ ధరలా..! అవును నిజమే
విమానాశ్రయాల్లోని కేఫ్ లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే, సమోసా రూ. 20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్కతాలోని కేఫ్ ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ. 100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో సమస్యను లేవనెత్తారు. ఐతే ఈ ఉడాన్ యాత్రి కేఫ్ లను దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది.