దుబ్బరాజేశ్వరస్వామి జాతర పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో ఈనెల 28 నుండి జరిగే దుబ్బరాజేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ముందుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు రాజేశ్వరస్వామి కండువా కప్పి సన్మానించారు. రెండు రోజులపాటు జరిగే శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి జాతరకు రావలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీని ఆహ్వానించారు. కార్యక్రమంలో నాగయ్యపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బండి కొండయ్య, గుంటి కొమురయ్య, రొండి శేఖర్, బండి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.