బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి:
జాతీయ బాలిక దినోత్సవ వేడుకలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి జిల్ల ఛైర్మెన్ కమతం అంజయ్య
పెద్దూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం
నేడు జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెద్దూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్ఫేర్ కమిటి జిల్ల ఛైర్మెన్ కమతం అంజయ్య బాలికలకు విద్యా ప్రాధాన్యత గురించి వివరిస్తూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. విద్యనే బాలికల్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతుందని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు బాలిక విద్య పరిష్కారం చూపుతుందని అన్నారు. చైల్డ్ మ్యారేజ్ ల గురించి మాట్లాడుతూ.. వయస్సు నిండకుండానే పెండ్లి చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. పసి వయస్సులో బాలికలు చదువుకు దూరమైతే పెద్దలు వారిని పెండ్లికి దగ్గర చేస్తారని అన్నారు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమ పేరుతో ఇంట్లోంచి పారి పోయి పోక్సో బాధితులుగా బాలికలు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ.. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై ఎప్పటి కప్పుడు దృష్టి సారించి పిల్లలు తప్పుదారి పట్టకుండా చూడాలని కోరారు. స్కూల్ డ్రాపౌట్ కావడం, బాల్య వివాహాలు, చదువులో వెనుకబాటు, పౌష్టికాహార లోపాలు బాలికల్ని దయనీయ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని అన్నారు. హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ మాట్లాడుతూ.. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సంవత్సరం బాలిక విద్యపై పని చేయనున్నట్లు తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల మాట్లాడుతూ.. బాలికల ఆత్మరక్షణ కోసం గత నాల్గు నెలలుగా కర్ర సాము శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బాలిక కర్ర సాము నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల, సైకాలజిస్ట్ పున్నం చందర్, ఖాజా నిజాముద్దీన్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తులు రమాదేవి, గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, జనగాం రాజమల్లు, లకావత్ ఉమ, నాగులవీణ, బైరివాణిశ్రీ , కడార్ల కల్పన, నందాల శంకర్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.