సిరిసిల్ల టౌన్, 25 జనవరి: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో మాల సామాజిక వర్గానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. సంఘం అధికార ప్రతినిధులుగా రెడ్డిమల్ల చిన్న దేవయ్య, కొంపెల్లి శ్రీనివాస్, గొర్రె స్వామి, రాకం చిన్న పరశురాములు, సహాయ కార్యదర్శులుగా మంగ పరశురాములు, బిట్ల శ్రీనివాస్, గట్టపెల్లి ఎల్లయ్య, జంగిటి రాజయ్యలను, కోశాధికారులుగా పల్క రవి, కొంపల్లి బాబు, గొర్రె మల్లేశం, రాకం సుమన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన రెడ్డిమల్ల దేవేందర్, రాకం రామచంద్రం, గొర్రె అర్జున్, కొంపల్లి నర్సయ్యలు నూతనంగా ఎన్నుకోబడిన ప్రతినిధులకు బాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభ్యున్నతికి పాటుపడతామని ఈ సందర్భంగా వారన్నారు.
Tags
Peddur