దుబ్బరాజేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల జిల్ల, 25 జనవరి: వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లిలో జరగబోయే దుబ్బరాజేశ్వరస్వామి జాతర (వాల్ పోస్టర్ )ను శనివారం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్వామివారి జాతర ఈనెల 28న మాఘ అమావాస్య రోజున పోచమ్మ బోనాలు, 29 బుధవారం రోజున ఉదయం 4 గంటలకు శివ కళ్యాణం, రధోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్, మైలారం రాము, అరుణ్ తేజచారి, తిరుపతి రెడ్డి, రొండి లక్ష్మణ్, కొమురయ్య, వెంకటేష్, కొండయ్య, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.