సీఎం సభా ప్రాంగణం ఏర్పాట్ల పరిశీలన
అధికారులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు
వేములవాడ, 17 నవంబర్ : ఈ నెల 20వ తేదీన జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు.
వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సీఏం సభా స్థలం, పార్కింగ్ స్థలం, అలాగే శ్రీ వేములవాడ రాజా రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ గెస్ట్ హౌస్, ఆలయ ఈవో గెస్ట్ హౌస్ ను ప్రభుత్వ విప్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద, అలాగే దర్శనం ఇతర చోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు. అన్ని పనులను వేగంగా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న భక్తులకు కూడా దర్శనానికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
ఇక్కడ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు జి అశోక్ ఆలయ సిబ్బంది ఉన్నారు.