రాజన్న సిరిసిల్ల 17 నవంబర్ : పంట అవశేషాలు అనగా ముఖ్యంగా వరిలో కొయ్యకాళ్ళు, పత్తి కట్టేలు కాల్చకుండ వాటిని కుళ్ళిన తరువాత తిరిగి భూమికి సేంద్రియ ఎరువుగా వినియోగించాలని అన్నారు జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. పంట అవశేషాలను కాల్చడం వలన విడుదల అయ్యే గ్రీన్ హౌస్ వాయువుల వలన వాతావరణం కాలుష్యం అవుతుంది. అదే విధంగా మనుషులు ఆరోగ్యం పైన తీవ్ర ప్రభం కలుగును. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతారు.
అదే విధంగా పంట అవశేషాలను కాల్చడం వలన వేడికి భూమిలోని తేమ శాతం తగ్గిపోతుంది. ఉపయోగకరమైన అనేక సూక్ష్మజీవులు చనిపోతాయి. అన్నిటికి కంటే ముఖ్యంగా మట్టి పోరలో వుండే పోషకాలు వేడికి ఆవిరి కావడం సేంద్రియ కార్బనము నశించి భూమి ఆరోగ్యం అనగా (soil Fertility ) పైన తీవ్ర ప్రభావం కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.