లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పలు అనారోగ్య సమస్యలతో శస్త్ర చికిత్స చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం కోరిన లబ్ధిదారులకు స్థానిక నాయకులు చెక్కులను అందించారు. సోమవారం 38వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. 38వ వార్డుకు చెందిన మచ్చ భారతికి రూ 46,500 చెక్కు అందజేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ 38 వార్డ్ ఇంచార్జి పిట్టల శ్రీకాంత్, ఈగ రాజు, పోతు రాజేష్, టౌన్ కార్యదర్శి పిట్టల దేవరాజ్, రామగిరి దిలీప్, గడ్డం ఎలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post