డిజిటల్ ల్యాండ్ రికార్డుల ఏర్పాటుకు నోడల్ అధికారులను నియమించాలి
ఫీల్డ్ సర్వే నిర్వహణ కోసం అవసరమైన మేర సర్వేయర్లు, వాహనాలను సిద్ధం చేసుకోవాలి
నక్షా (నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్) పై దేశంలోనే వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన మనోజ్ జోషి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ -28: దేశంలోని 100 పట్టణాలలో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు కింద డిజిటల్ ల్యాండ్ రికార్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా అధికారుల అవసరమైన కార్యాచరణను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ మనోజ్ జోషి అన్నారు
గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ నక్షా (నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ పై దేశంలోనే వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు,అదనపు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో భాగంగా భూ రికార్డులను డిజిటలైజ్ చేసి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ముందస్తుగా 100 పట్టణాల్లో నక్షా (నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్) కార్యక్రమం పైలట్ కింద అమలు చేస్తున్నామని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో నక్షా కార్యక్రమ అమలు కోసం నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమించి, వారి కాంటాక్ట్ వివరాలు అందజేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో భూ రికార్డులు డిజిటల్ చేసేందుకు వీలుగా అవసరమైన మ్యాన్ పవర్, కార్యాలయాలు, సామాగ్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.
ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నక్షా కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన అర్బన్ ప్రాంతాలలో భూ రికార్డుల సర్వే కోసం క్షేత్ర స్థాయిలో అవసరమైన బృందాలు సర్వేయర్లు,వాహనాలు సామాగ్రి మొదలగు ఏర్పాట్ల ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.పట్టణ ప్రాంతాలలో ఆస్తి పన్ను, ఇతర పన్ను వసూళ్లకు సంబంధించిన రికార్డుల సహాయంతో భూముల సర్వే ప్రక్రియ చేపట్టాలని, సర్వేకు న్యాయబద్ధమైన ఆముదం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల్లో రీ సర్వే చేసి భూ రికార్డులను డిజిటలైజ్ చేయడం జరుగుతుందని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణం, నాంపల్లి తిప్పాపూర్ శాంతరాజు పల్లి, సంకేపల్లి గ్రామాలలో భూ రికార్డులకు సంబంధించి రి-సర్వే చేసి వివరాలను డిజిటల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, డి ఆర్ డి ఓ శేషాద్రి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సర్, ఏ.డీ లాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ బాలచందర్ సంబంధించిన తదితరులు పాల్గొన్నారు.