ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూ ఢిల్లీ : నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై లోకసభ, రాజ్యసభ సభ్యులు చర్చించ నున్నారు. అలాగే, పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది.