అప్పెరల్ పార్కు గోదాములలో ధాన్యం నిల్వకు చర్యలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అప్పెరల్ పార్కు గోదాములలో ధాన్యం నిల్వకు చర్యలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, నవంబర్-02: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అప్పెరల్ పార్కు గోదాములలో నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు.శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు అనుకూలంగా ఉన్న అప్పెరల్ పార్క్ గోదాములను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రైతుల వద్ద నుంచి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపర్చేందుకు ఇంటర్మీడియట్ గోదాములను పరిశీలించామని, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ అప్పెరల్ పార్క్ గోదాములలో 3 లక్షల మెట్రిక్ట్ టన్నులకు పైబడి నిలువ చేసే సామర్థ్యం కలదని పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post