సిరిసిల్ల జిల్లాలో లక్షా 90 వేల 626 ఇండ్లు గుర్తింపు
సర్వే నిర్వహణకు 1488 ఎన్యుమరేటర్,160 మంది సూపర్వైజర్ నియామకం
1468 ఎనుమరేషన్ బ్లాక్ లు (EB) ఏర్పాటు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ల కు, సూపర్వైజర్లకు, సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ -07: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్లకు, సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణను మాస్టర్ ట్రైనర్లకు, సూపర్వైజర్ లు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులకు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
*అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ,* రాష్ట్రంలోని ప్రజల సామాజిక, ఆర్థిక , విద్య, ఉపాధి రాజకీయ , కుల సర్వే చేపట్టాలని ప్రభత్వం నిర్ణయించిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమగ్ర సర్వేలో భాగంగా 100% హౌస్ లిస్టింగ్ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1 లక్షా 90 వేల 626 ఇండ్లు , 1468 ఎన్యుమరేషన్ బ్లాక్ లలో ఉన్నాయని గుర్తించామని, ప్రతి 150 ఇండ్ల సర్వేకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున కొంతమంది రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 1488 ఎన్యుమరేటర్లు , 160 మంది సూపర్వైజర్లను నియమించామని అన్నారు.
ప్రతి మండలంలోని సూపర్వైజర్లు , ఎన్యుమరేటర్లకు సర్వే నిర్వహణ వివరాల సేకరణ ఆన్ లైన్ లో డాటా ఎంట్రీ తదితర అంశాలపై తహసిల్దారులు మండల ప్రత్యేక అధికారులు శిక్షణ అందించాలని, ఈ కార్యక్రమం నేడు, రేపు పూర్తి చేసుకోవాలని, గ్రౌండ్ లెవెల్ లో సిబ్బందికి ఎటువంటి అనుమానాలు రాకుండా పకడ్బందీగా శిక్షణ అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
నవంబర్ 9 నుంచి ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ఈబి బ్లాగ్ లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం వివరాలు పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. 15 రోజుల వ్యవధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయాలని అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షెడ్యూల్ పై టామ్ టామ్ నిర్వహించాలని, ఈరోజు ఎక్కడ సర్వే చేస్తారనే విషయం ప్రజలకు తెలియజేయాలని, సర్వే సమయంలో ప్రజలు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ , పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
ప్రతి రోజు నిర్వహించే సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఎన్యుమరేటర్ మండల స్థాయిలో తాసిల్దార్ కార్యాలయంలో అప్పగించాలని, ఆ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తే ఎందుకు అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని, అవసరమైన మేర కంప్యూటర్ సిస్టంలను సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతిరోజు జరిగే సర్వే వివరాలను ఎంపీడీవో ఆధ్వర్యంలో సేకరించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని అన్నారు. ఆన్ లైన్ లో సర్వే డేటా ఎంట్రీ పర్యవేక్షణకు నాయబ్ తహసిల్దార్ ఆధ్వర్యంలో 2 సిబ్బందితో బృందం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సి.పి.ఓ. శ్రీనివాస చారి మండల ప్రత్యేక అధికారులు డి.ఎల్.ఎం.టి లు, సూపర్వైజర్లు ఎంపీడీవోలు తాసిల్దార్లు సంబంధించిన తదితరులు పాల్గొన్నారు.