రైతు పండుగ కు ఆహ్వానం
రైతు సోదరులు అందరూ తరలిరావాలి
సీఎం సభ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, నవంబర్ -29
ఈ నెల 30 వ తేదీన(శనివారం) రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుండి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 13 రైతు వేదికలలో ఈ కార్యక్రమము నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని రైతు సోదరులందరూ తమ గ్రామాలకి సమీపంలో ఉన్న సోదరులందరూ పెద్ద సంఖ్యలో రైతు వేదికలకు తరలివచ్చి, సీఎం ప్రసంగాన్ని వీక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.
కోనరావుపేట మండలం నిజామాబాద్, తంగళ్లపల్లి మండలం తాడూరు, గంభీరావుపేట మండలం నర్మాల, రుద్రంగి, ముస్తాబాద్ మండలం బద్దనకల్, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట, చందుర్తి, బోయినపల్లి మండలం కొదురుపాక, వేములవాడ అర్బన్ మండలం మారుపాక, వీర్నపల్లి, ఇల్లంతకుంట రైతు వేదికల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.