తెలంగాణలో దీపావళి హాలిడే ఎప్పుడంటే.?

దీపావళి వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 31, గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రస్తుతం పాఠశాలలు సమ్మేటివ్ మూల్యాంకనం - 1 పరీక్షలను అన్ని తరగతులకు అక్టోబర్ 28 వరకు నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత సెలవు ఉంటుంది. దీపావళి జరుపుకోవడంపై ఓ కన్ఫ్యూజన్ నెలకొంది. దీపావళి అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 1న సాయంత్రం 5:14 వరకు ఉంటుంది. సాధారణంగా అమావాస్య తిథి నాడు రాత్రి లక్ష్మీపూజ చేస్తారు. అందుకే అక్టోబర్ 31నే దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గోవా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో దీపాల పండుగను అక్టోబర్ 31వ తేదీనే జరుపుకుంటారు. అందుకే ఈ తేదీన సెలవు ప్రకటించారు.

Post a Comment

Previous Post Next Post