విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి: వ్యవసాయ అధికారులు

గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహణ కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏఈవోలు రైతులకు పలు సూచనలు చేశారు. విక్రయ డీలర్లు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. 

అధీకృత లైసెన్సెడ్ విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు.

రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, తీసుకున్న రసీదుపై విత్తనం పేరు, రకం, కంపెని పేరు, లాట్ నెంబర్, ధర ఉండేటట్లు చూచుకోవాలని తెలిపారు.

విత్తన ప్యాకెట్ పై తయారైన తేదీ, కాలం ముగిసిన తేది చూసుకోవాలి.

గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు వ్యవసాయ అధికారులకు తెలియ జేయాలి.

పక్క జిల్లా నుండి పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనాలు లూస్ విత్తనాలు అమ్మినచో తమకు తెలియజేయాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post