అసాంఘిక కార్యకలాపాల నివారణకే లాడ్జిలు, హోటల్ లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేకమైన చర్యల నివారణకే శనివారం రోజున రాత్రి సమయంలో వేములవాడ పట్టణంలో లాడ్జిలు, హోటల్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు, హోటల్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుదాని ఈ సందర్భంగా జిల్ల ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
జిల్లాలో ఉన్న హోటల్స్, లాడ్జిలలో అసాంఘిక కార్యాలపాలకు, చట్టవ్యతిరేకమైన చర్యలకు తావులేకుండా శనివారం రోజున రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, లాడ్జిలలో బసకోసం వచ్చే వారి ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులు తప్పకుండ తీసుకోవాలని, లాడ్జిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఎవరైన కొత్తవారు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్ వారికి సమచారం ఇవ్వాలని సూచించారు.
తంగలపల్లి మండల కేంద్రలో వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
తంగలపల్లి మండల కేంద్రంలో చందా అరుణ (29) అనే మహిళ చందా నందిత (22) అనే యువతితో తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నది అనే సమాచారాం మేరకు ఎస్.ఐ తంగలపల్లి తన సిబ్బందితో తనిఖీలు చేయగా రాహుల్ యాదవ్ అనే వ్యక్తి పట్టుపడ్డాడు. వీరిని అదుపులోకి తీసుకొని వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన కేసులు పెడతామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాంటి వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.