హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ముసాపేట, ఎర్రగడ్డ, ఎస్సాఆర్ నగర్, బొరబండ, మోతినగర్, మదాపూర్, జూబ్లీహిల్స్ వర్షం పడుతోంది.
ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, బంజారహిల్స్, కోటి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ లో కూడా తేలిపాటి వానలు పడ్డాయి.
సిటీలో క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడ్డాయని.. వీటితో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ, డిజస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అలర్ట్ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.