ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. *కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంత మంది తీసుకుంటే అంత మందికి మాఫీ వర్తింపజేస్తారా? అనేది తేల్చాలి. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించింది.
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీకి కసరత్తు
byJanavisiontv
-
0