భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష

సిరిసిల్ల, మే 16 : కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భూ సేకరణ పనులు, ఇతర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ, అనుపురం, కొడుముంజ, నాంపల్లిలో ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందని వివరించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఎఫ్ఓ బాలామణి, రైల్వే శాఖ సీఈ, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఏడీ సర్వే శ్రీనివాస్, ఆర్ అండ్ బీ, ఉద్యానవన ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post