హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్

హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న వెదర్.. మధ్యాహ్నం 2 గంటల సమయానికి చల్లబడింది.
హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. 2024, మే 16వ తేదీ గురువారం సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
మే 16వ తేదీ గురువారం సాయంత్రం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని.. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయని.. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుందని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

తెలంగాణకు భారీ వర్ష సూచన, రుతుపవనాల లేటెస్ట్ అప్డేట్ చెప్పిన ఐఎండీ

 నిన్న పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం ఈరోజు తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు అక్కడ అక్కడ, రేపు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. 

వాతావరణ హెచ్చరికలు

ఈరోజు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ., రేపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి. మీ., వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 16న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గాలులు (30-40 కి.మీ.) తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల నుంచి వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలుగా నమోదైంది. 60 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా..

 ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకూ ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post