ఎస్ఎస్సి, ఇంటర్ టాపర్ విద్యార్థులను సత్కరించిన ముదిరాజ్ సేవాసమితి

ఎస్ఎస్సి, ఇంటర్ టాపర్ విద్యార్థులను సత్కరించిన ముదిరాజ్ సేవాసమితి

బ్యూరో చీఫ్రాజన్న సిరిసిల్ల: విద్యనే ఆయుధంగా చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షులు జెల్ల వెంకటస్వామి. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎస్ ఎస్ సి, ఇంటర్ మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచిన ముదిరాజ్ విద్యార్థులను సత్కరించిన సందర్భముగా ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో ఎస్ ఎస్ సి, ఇంటర్ మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించినందుకు గర్వకారణం అన్నారు. ఇంతటితో విద్యార్థులు గర్వపడకుండ ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, మహాత్మ జ్యోతిభపూలే, స్వామి వివేకానంద, అబ్దుల్ కలామ్ లాంటి మహాత్ములను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత భవిష్యత్తు పొందాలని సూచించారు. లక్ష్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసే గుణాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలన్నారు. పేదరికం ఉన్నత లక్ష్యానికి అడ్డంకి కాదనీ. తల్లి తండ్రులను, గురువులను, తోటి వారిని గౌరవించాలని విలువలతో కూడిన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. వీలైనంతవరకు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంటూ, ఉన్నత విద్య కోసం బీసీ స్టడీ సర్కిల్ ఇచ్చే ఉచిత శిక్షణను, ఇక్కడి గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ సి, ఇంటర్ టాపర్లను సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సేవా సమితి సభ్యులు మెమోంటోలు అందించి శాలువాతో సత్కారం చేశారు. ముందుగా మహాత్మ జ్యోతీభ ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతీ ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సేవా సమితి సభ్యులు బొజ్జ కనుకయ్య, కరుణాల భద్రాచలం, చొక్కాల రాము, గనాది శ్రీనివాస్, యాదగిరి, బొజ్జ లక్ష్మిరాజం, సరుగు నరేష్, భిక్షపతి, బాబు, తునికి నరేశ్, గొడుగు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post