అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

సిరిసిల్ల, మే 9 : ఈ నెల 13 వ తేదీన లోక్ సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. (స్వీప్ SYSTAMTIC VOTER EDUCATION AND ELECTRORAL PARTICIPATION) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సిరిసిల్ల మున్సిపల్ పరిధి అపెరల్ పార్క్ లోని గ్రీన్ నిడిల్ సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి 'ఐ ఓటు ఫర్ ష్యూర్' ఓటు హక్కు నా బాధ్యత' పై అవగాహన కల్పించారు. ఈ నెల 13 వ తేదీన లోక్ సభ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, గ్రీన్ నిడిల్ సంస్థ జీఎం మతిన్ అహ్మద్, హెచ్ఆర్ మేనేజర్ ఫణి, డీపీఎం, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post