తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

హైదరాబాద్, మే 02: తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది. రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండలతో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదయ్యాయి. చందూరు, మంగపేట, భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్, వైరా, ఖనాపూర్, ముత్తారం, వెల్గటూర్ ప్రాంతాల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50 డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్రతల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

Post a Comment

Previous Post Next Post