తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు.టెన్త్ ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మే 16 నుంచి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. రీ కౌంటింగ్ 15 రోజుల వరకు జరుగుతుంది. ఒక్కోసబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం రూ.1000 చెల్లించాలి.
- వార్తలు
- e PAPER
- తెలంగాణ జిల్లాలు
- _Karimnagar
- _RajannaSircilla District
- _Jagitial District
- _Peddapalli District
- _Nizamabad District
- _Bhupalapalli District
- _Hyderabad
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- _Tirumala
- _Vijayawada District
- _Amaravati
- _Visakhapatnam
- జాతీయ వార్తలు
- _Delhi
- ఉద్యోగ సమాచారం
- అంతర్జాతీయ వార్తలు
- _Palestine
- _Israel
- క్రీడా వార్తలు
- _Cricket