సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్ల సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పట్ల నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని వార్డులలో కార్యవర్గాన్ని నియమిస్తూ, పార్టీలో చురుకుగా పనిచేసే కార్యకర్తలు, నాయకులకు పదవులను ప్రకటిస్తున్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డులో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సీనియర్ మహిళా కార్యకర్త సామల రోజాను మహిళా కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షురాలుగా నియమించి నియామక పత్రం అందించారు. అదే వార్డుకు చెందిన సామల గీతను వార్డు మహిళ అధ్యక్షురాలిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, మాజీ కౌన్సిలర్ అడేపు చంద్రకళ, బ్లాక్ అధ్యక్షురాలు పద్మ, టౌన్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, కోడం సుధ, 37వ వార్డ్ కమిటీ ఉపాధ్యక్షురాలు కే.వసుందర, ఎలగొండ మనెవ్వ, కోశాధికారి పి.లావణ్య, కార్యదర్శి ఏ.వైష్ణవి, సహాయ కార్యదర్శి పి.పద్మ, ఏ.లాస్య, సభ్యులు సామల నాగరాణి, యెలగొండ ఉమ, జక్కని మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షురాలుగా సామల రోజ నియామకం
byJanavisiontv
-
0