జిల్లాలో 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్

3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్.... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. 

గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2023-24 సంవత్సరంలో 100% ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే నిర్వహించిన 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లేబర్ రూం లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేశారు. 

2023-24 సంవత్సరంలో 100% సీజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే ప్రసవాలు నిర్వహించిన ప్రైవేటు నర్సింగ్ హోమ్ లను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని, వారి ఆదేశాల ప్రకారం వేములవాడ లోని అమృత నర్సింగ్ హోమ్, వాసుదేవ ఆసుపత్రి, సిరిసిల్లలోని సరయు ఆసుపత్రులలో ప్రసూతి గదులను సీజ్ చేశామని అన్నారు.

ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆసుపత్రులలో ఎటువంటి ప్రసవాలు నిర్వహించడానికి వీలులేదని, సదరు ఆసుపత్రులలో ప్రసవాలు జరగవని వైద్యరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటన లో తెలిపారు

Post a Comment

Previous Post Next Post