జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దామని అన్నారు ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గురువారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు బాపులే జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ నేటి యువతరం ఆ మహనీయుని ఆలోచనలు, ఆశయాలు తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. జ్యోతిరావు బాపులే ఆనాటి కాలంలోనే అణచివేతకు గురవుతున్న వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అని అన్నారు.


ఆ కాలంలోనే మారుతున్న ప్రపంచానికి,దేశానికి అనుగుణంగా ఉండేందుకు, అణిచివేత నుండి బయటకు రావాలంటే చదువు ఒక్కటే తోడ్పాటు అందిస్తుందని చదువు యొక్క ప్రాముఖ్యతను అనేక మందికి తెలుపుతూ ఎంతోమందిని ఉన్నతమైన మార్గంలో వెళ్లేందుకు ఒక దారి చూపిన గొప్ప విద్యావేత్త అని అన్నారు.

మహాత్మ జ్యోతిరావు బాపులే సతీమణి సావిత్రి బాయి పూలే మన దేశంలో మెుట్టమెుదటి భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అని అన్నారు.

వారు సమాజంలోని అట్టడుగు కులాల అభివృద్ధికి తోడ్పడు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తూ వారు ఉన్నతమైన చదువులు చదివేందుకు వీలుగా ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

వెనుకబడిన తరగతుల వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా 
ముందుకు పోవాలని, వారు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణల ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మహిళలకు అవకాశం కల్పించారని అన్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ఇచ్చారని గుర్తు చేశారు.

రానున్న రోజుల్లో మహనీయుల జయంతి,వర్ధంతి ఉత్సవాలు జరుపుకునేందుకు వీలుగా, ఈ తరానికి వారి సేవలు తెలిసేలా, వారిని మార్గదర్శిగా తీసుకొని జీవితంలో ముందుకు పోయేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, కనికరపు రాకేష్, నాగుల రాము గౌడ్, గంటల ప్రకాష్, పుల్కం రాజు, వస్తాడు కృష్ణ,నాగుల మహేష్, ముకుంద రెడ్డి, బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post