నేతన్నల సమస్యలను పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం - CITU


నేతన్నల సమస్యలను పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం


మూషం రమేష్ - తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు


సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో చేనేత జోలి శాఖ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టిన నేతన్నలు


ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న వారందరికీ నిరంతరం ఉపాధి కల్పించే విధంగా బతుకమ్మ చీరలు మరియు ప్రభుత్వానికి అవసరం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వస్త్రాలన్నింటి ఆర్డర్ ఇవ్వాలని , టెక్స్ టైల్ పార్క్ లో కాటన్ RVM మంత్రానికి కార్మికులకు కూలి పెంచి నిర్ణయించాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తిచేసి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అన్ని రంగాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి సత్వర చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో సిఐటియు పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల లోని చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది 


ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ పవర్లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ గార్లు మాట్లాడుతూ ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం , ప్రభుత్వం బతుకమ్మ చీరలు , ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడం , పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోవడం వలన గత కొన్ని నెలల నుండి సిరిసిల్లలో పవర్లూమ్స్ బంద్ పడి వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న వేలాదిమంది పవర్లుమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ విషయాన్ని సంబంధిత అధికారులు , ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన కూడా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు


ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో గత కొన్ని నెలల నుండి సరియైన ఉపాధి లేక నేతన్నలు కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే గతంలో మాదిరిగా మళ్లీ ఆకలి చావులు , ఆత్మహత్యలు పునరావృతం అయ్యే అవకాశం ఉన్నదని కావున ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆర్డర్లు కేటాయించి అందరికీ ఉపాధి కల్పించి  సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు


ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , కూచన శంకర్ , సిరిమల్ల సత్యం , ఒగ్గు గణేష్ , బెజుగం సురేష్ , గడ్డం రాజశేఖర్ , మూషం శంకర్ , అక్కల శ్రీనివాస్ , ఆడెపు రవి , రవీందర్ , రాజమౌళి , వెంకటేశం , రాజు , ప్రవీణ్ ,  సత్యం , మహేష్ , సంపత్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post