జిల్లెళ్ల వద్ద చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపట్టాలి : జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలు సూచనలు చేసారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
రానున్న లోక్ సభ ఎన్నికలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా సరిహద్దుల్లో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి జిల్లా గ్రీవియన్స్ కమిటీ కి అప్పజెప్పడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. 

ఎస్పీ వెంట ఎస్.ఐ సుధాకర్ సిబ్బంది ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post