ఆధారాలు లేకుండా 50 వేల రూపాయలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేయండి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి


పెద్దమ్మ స్టేజ్ వద్ద చెక్ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, మార్చి 28: సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదును తరలిస్తే సీజ్ చేయాలని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును గురువారం సాయంత్రం అదనపు కలెక్టర్ పి.గౌతమితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చెక్ పోస్టు వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.50 వేలకు మించి నగదును సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. 
తనిఖీలో తహశీల్దార్ భూపతి, తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post