సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల: ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ పోస్టులు పెట్టవద్దని సూచించారు. అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ మేరకు జిల్లా ఎస్పీ ఒక ప్రకటన జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు, చిత్రాలు షేర్ చేయవద్దని కోరారు. అనవసర మెసేజ్లు పెట్టి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.
వాట్సప్ గ్రూప్ లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మెసేజ్ లు పోస్ట్ చేసిన, ఫార్వార్డ్ చేసిన
ఫార్వార్డ్ చేసే వారితో పాటు గ్రూప్ అడ్మిన్ ల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ తరువున అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఎస్పీ తెలిపారు.