సంతు సేవాలాల్ ఆశయసాధనకు పాటు పడుదాం అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.. సిరిసిల్ల పట్టణంలో జరిగిన సంతు సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు..
ప్రజలందరికీ సంతు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అభివృద్ధి కోసం సంతు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు
సమాజంలో ఒక ఆధ్యాత్మిక వేత్తగా,సాంఘిక దురాచారలు రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు..
బ్రిటిష్ పరిపాలనపై పోరాటం చేస్తూ దేశ స్వతంత్రానికి తన వంతు పాత్ర పోషించారని అన్నారు..గిరిజన జాతికి మార్గదర్శిగా జాతి కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు..
మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ,మంచి నడవడికలో నడవాలని బోధించారని గుర్తు చేశారు.
సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.. సంతు సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని స్వీకరించి వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి విషయంలో ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.గిరిజనులకు పొడు భూముల పట్టాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.