నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించునున్న అస్సోం సీఎం

ఆదిలాబాద్ జిల్లా:ఫిబ్రవరి 20
తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధిక సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ర‌చించింది. రాష్ట్రంలో బీజేపీ పెద్ద‌ల ప‌ర్య‌టన‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచా రాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ విజ‌య సంక ల్ప‌యాత్ర‌ను ప్రారంభించ‌ నున్నారు.


భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో శ్రేణులను ఏకధాటిపై తేవడం కోసం, పార్టీ విధివిధానాలను, తమ వైఖరిని ప్రజల్లోకి తీసుకె ళ్లడం లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ఇవ్వాళ బాసర పుణ్యక్షేత్రం నుండి ప్రారంభి స్తున్నారు.

అదిలాబాద్, పెద్దపెల్లి నిజాంబాద్ పార్లమెంటు స్థానాలను అనుసంధానిస్తూ 21 శాసనసభ స్థానాల్లో సుమారు 310 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

Post a Comment

Previous Post Next Post