హైదరాబాద్ : రెండో రోజు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC Council Meeting) హాట్‌హాట్‌గా సాగుతోంది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalakshmi) అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది..
ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఎకరువు పెడుతున్నారు. హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. కుక్కలు కరిసి జనాల ప్రాణాలు పోతున్నాయని.. అయినా పట్టించుకోరా అంటూ అధికారులను కార్పొరేటర్లు నిలదీశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ తక్కువ, ఫంక్షన్స్ ఎక్కువ అని కార్పొరేటర్లు చెబుతున్నారు..
బీజేపీ కార్పొరేటర్ల ఆవేదన..
కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు (BJP corporators) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేటర్లను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారన్నారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది..
కాగా.. నిన్నటి కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు లంచ్ లోపు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చ జరుగనుంది. మధ్యాహ్నం లంచ్ తరువాత 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రూ.8437 కోట్ల జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను మేయర్ ప్రవేశపెట్టనున్నారు. రూ.7937 కోట్ల సాధారణ బడ్జెట్, రూ.500 కోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బడ్జెట్‌ను రూపొందించారు.