పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్

సిరిసిల్ల, ఫిబ్రవరి 19, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.

 సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 

ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న ప్రతి యువత ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రూపొందించిన తుది జాబితా విడుదల తర్వాత ఆయా జిల్లాలలో భారీగా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు కొరకు దరఖాస్తులు రావటం పై వికాస్ రాజ్ ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికలకు తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బంది వివరాలు తీసుకొని ఎపిక్ నెంబరుతో సహా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలనీ తెలిపారు. పోస్టల్ ఓటుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, పూజారి గౌతమి మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ప్రచురించి అన్ని పోలింగ్ స్టేషన్లు, రాజకీయ పార్టీలకు పంపించడం జరిగిందన్నారు.
 కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డుల ముద్రణకు పంపడం జరిగిందని పోస్ట్ ద్వారా వారి ఇంటికి చేరుతాయని తెలిపారు. ఒకవేళ ఎవరిదైనా ఎపిక్ కార్డు పోగొట్టుకొని ఉంటే వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. చనిపోయిన ఓటర్లు, లేదా డూప్లికేట్ ఓటర్లు ఉంటే సంబధిత బి.ఎల్. ఒ లకు లేదా తహశీల్దార్లు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.  ఇప్పటికే ఈ.వి.యం మొదటిస్థాయి పరిశీలన పూర్తి చేసుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు ఆనంద్ కుమార్, మధుసూదన్, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస చారి, ఎపీడీ నర్సింహులు, తహశీల్దార్ షరీఫ్ మోహినొద్ధీన్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post