తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్ల: జనవరి 15
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి.సోమవారం సంక్రాంతి పండుగ పర్వదినం కావడంతో ఊరూవాడ తెల్లవారు జామునే తెలుగింటి ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తున్నారు. సంక్రాంతి పండుగను తదితర ప్రాంతాల్లో గంగిరెద్డుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఉదయం నుండి చిన్నారులు సందడి చేయగా మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలో గంగిరెద్దుల హడావిడితో పాటు కళాకారుల ఆటపాటలతో అచ్చం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబించడంతో పాటు చిన్ననాటి మధుర స్కృతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానూ ఆహ్లాదకర వాతావరణలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వేకువ జామునే ఇళ్ల ముందు కల్లాపి జల్లి, రంగుల రంగవళ్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు.ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ ఉట్టి పడింది. మూడు రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగభాగ్యాలు తెచ్చే బోగి పండుగను ప్రజలు అట్టహాసంగా జరిపారు.ఇటు మంచిర్యాల జిల్లాలోనూ ఉదయం నుండే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకున్నారు. వాకిళ్ల ముందు తీరొక్క రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Post a Comment

Previous Post Next Post