రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు సుడిగాలి పర్యటన

హైదరాబాద్:నవంబర్ 15
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బుధవారంసుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ సభలు నిర్వహించి, అందులో పాల్గొన్న మంత్రి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత క్షణం తీరిక లేకుండా సభలు, సమావేశాశాల్లో పాల్గొంటూనే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

*కెసిఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కెటిఆర్ ముందుకు సాగుతున్నారు*

ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు కెటిఆర్ బిజిబిజీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయనున్నారు. కెటిఆర్ ఆరు రోజుల్లో 25 నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలలో పాల్గొననున్నారు.

అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ప్రతి రోజూ ఐదు కార్యక్రమాలలో కెటిఆర్ పాల్గొంటారు. బుధవారం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పాల్గొననున్నారు.

వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే కథలాపూర్, మేడిపల్లి, మండలాల ప్రజాఆశీర్వాద సభలో, రుద్రంగి మండల కేంద్రంలో రోడ్ షోలో, చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు.

అనంతరం కోనరావుపేట మండలకేంద్రంలో రోడ్ షో, వేములవాడ పట్టణంలో నిర్వహించే వేములవాడ అర్బన్, రూరల్ మండలాల రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొననున్నారు...

Post a Comment

Previous Post Next Post