►బోథ్, నిర్మల్ కాంగ్రెస్ సభలలో పాల్గొననున్న రేవంత్
►ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న రేవంత్..
నేటి నుంచి ఓటర్ స్లిప్స్ పంపిణీ మొదలు..
►తెలంగాణవ్యాప్తంగా నేటి నుంచి ఓటర్ స్లీప్స్ పంపిణీ మొదలు
►తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పంపిణి చేయనున్న ఎలక్షన్ కమిషన్
►BLO ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్స్ పంపిణీ
►ఓటుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే 1950 నంబర్‌కు కాల్ చేయాలని ఈసీ విజ్ఞప్తి..
నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
►సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.
►నిజామాబాద్ అర్బన్, బోధన్, ఎల్లారెడ్డి మూడు సభల్లో పాల్గొననున్న కేసీఆర్
►నిజామాబాద్ బోధన్‌లలో అభ్యర్థులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
►భారీ జనసమీకరణ చేస్తున్న పార్టీ నేతలు..
నామినేషన్ల ఉపసంహరణకు నేడే లాస్ట్
►అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ముగియనున్న గడువు
►నామినేషన్ల పరిశీలన తరువాత ఆమోదించిన అభ్యర్థులు 2,898 మంది
►గజ్వేల్ బరిలో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు.
►మేడ్చల్‌లో 67 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
►కామారెడ్డిలో 56 మంది అభ్యర్థుల నామినేషన్లు
►ఎల్బీనగర్‌లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం.
►గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి ధరణి, మల్లన్న సాగర్ బాధితులు, నిరుద్యోగుల నామినేషన్ల దాఖలు
►మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం.
►భారీగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందంటున్న పార్టీలు.
►రెబల్స్‌ను, ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగిస్తున్న పార్టీలు.