బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post