హైదరాబాద్,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): ఇటీవల తాము నిర్వహించిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. తూర్పు సముద్ర తీర సమీపంలో సర్ఫేస్ టు సర్ఫేస్ వెర్షన్ టెస్టు చేశామని పేర్కొంది. ఈ టెస్టుకు సంబంధించిన వీడియోలను తాజాగా ట్విటర్(X)లో షేర్ చేసింది. నేలపై నుంచే కాకుండా సముద్రంపై నుంచి, సముద్రం లోపల, గగనతలంపై నుంచి కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.
Tags
జాతీయ-వార్తలు-delhi