Headlines

AP: పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని రేపు రాత్రి 7.05 గంటలకు మూసివేస్తామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేశారు.

 TS: మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడంపై పరిశీలన చేసిన కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఈరోజు ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. కట్‌ ఆఫ్‌ వాల్‌కు పైపింగ్‌ కారణంగా పునాదుల కింద ఉన్న ఇసుక క్రమంగా వెళ్లిపోయి పియర్స్‌కు నష్టం వాటిల్లిందన్న ప్రాథమిక అభిప్రాయానికి నిపుణుల కమిటీ వచ్చినట్లు తెలిసింది.

 TS: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

మొదట ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెరువు గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు..

తరువాత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ పట్టణంలో తొర్రూర్‌ వెళ్లే ప్రధాన రహదారి పక్కన 3.10కి.. 

చివరగా అదే జిల్లాలోని వర్ధన్నపేటలో బట్టుపల్లి ఎస్‌ఆర్‌ కళాశాల మైదానంలో 4.10కి నిర్వహిస్తున్న సభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

 TS: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేసారు. 

ఇవాళ ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొంటారు.. 

మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు, సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. 

సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు.

మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.

 TS: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేయనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు బైనాక్యులర్ను కేటాయించింది.

 Gold Price Today: హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 61, 960 గా నమోదైంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 56, 800 గా ప‌లుకుతుంది.

ఇక కేజీ వెండి రూ. 500 పెరిగి రూ. 78,000 గా నమోదు అయింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు.

27,088 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

 HYD: పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుండగా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతను మరింత పెంచుతున్నాయి.

కొద్ది రోజులుగా చలి పెరుగుతుండటంతో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండగా, కనిష్ఠ ఉష్రోగ్రతలు నమోదైన సమయాల్లో నాణ్యత సూచి స్వచ్ఛం నుంచి మధ్యస్థస్థాయికి పడిపోతోంది.

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కొద్దిరోజులుగా వాయుకాలుష్యం పెరుగుతోంది.

TS: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది.

నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, నేడు జరగనున్న కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయనుంది.

ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

 HYD: ఉల్లి ధరలు వారం రోజులుగా అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి సెప్టెంబరుకి నాలుగు, ప్రస్తుతం రెండు కేజీలకి తగ్గింది.

 TS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నారు.

అక్కడ ఏర్పాటు చేయనున్న యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు.

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త వినిపించింది.

నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను దక్కనుంది.

TS: ఎలారెడ్డి మాజీ ఎం.ఎల్.ఏ. బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ కండువా కప్పి రవీందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ ఇంచార్జి థాక్రే.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరారు ఏనుగు రవీందర్ రెడ్డి.

వీరితోపాటు సంతోష్ కుమార్ ( మాజీ ఎమ్.ఎల్.సి ) కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

గతంలో ఈటల రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరూ ఒకేసారి బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post