భారత ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

విశాఖపట్నం, 29 అక్టోబర్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒక రోజు విశాఖ పర్యటన అనంతరం శనివారం సాయంత్రం ఐ.ఎన్.ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్, నేవీ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆంధ్రా వైద్య కళాశాల శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసి, తిరుగు పయనమైన ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జ్ఞాపికను అందజేశారు.
 తదుపరి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, జిల్లా ఇన్ చార్జి మంత్రి విడదల రజని, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్క్ వీడ్కోలు పలికారు. 
అలాగే రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహ రావు, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమీషనర్ ఎ.రవిశంకర్, ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Post a Comment

Previous Post Next Post