పాక్షిక చంద్రగ్రహణం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

Sri Venkateswara Swamy TEMPLE DOORS CLOSED

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ‌నివారం రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.

ఆదివారం తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. గ్ర‌హ‌ణం అనంత‌రం శుద్ధి చేసి ఉద‌యం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. 

అదేవిధంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శ‌నివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరుస్తారు.

Post a Comment

Previous Post Next Post