వేములవాడ రాజరాజేశ్వర స్వామి సేవలో కరీంనగర్ సిపి

రాజన్న సిరిసిల్ల జిల్ల, 29 అక్టోబర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిపి కుటుంబ సభ్యులకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి కండువా ప్రసాదాలను ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పట్టణ సీఐ కరుణాకర్, పోసాని రాజు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post