నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వ్యభిచార గృహాలపై సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ రాజ్, సిఐలు అజయ్, అంజయ్య తన సిబ్బందితో వ్యభిచార గృహాలపై శుక్రవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో ఐదుగురు విటులను, ముగ్గురు నిర్వాహకులు అరుణ, విజయ, శోభాను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 76,050/- నగదు స్వాధీన పరుచుకున్నారు.
అనంతరం పదిమంది బాధిత మహిళను గుర్తించి, సఖి సెంటర్ కు తరలించారు.